Tim Cook | వెలుగుల పండుగ దీపావళిని (Diwali) దేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లు, విదేశీలు కూడా ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి.. బాణాసంచా కాలుస్తూ కుటుంబంతో సరదగా సమయాన్ని గడిపారు.
ఇక యాపిల్ సీఈవో (Apple CEO) టిమ్ కుక్ (Tim Cook) ఈ దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అందమైన దియాస్ పిక్‌ను షేర్ చేశారు. దీపావళిని ఆనందంగా, శాంతియుతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ ఫొటోను రోహిత్ వోహ్రా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ద్వారా తీసినదిగా చెప్పుకొచ్చారు. కాగా, రోహిత్ వోహ్రా ఢిల్లీకి చెందిన ఫొటోగ్రాఫర్ (Delhi photographer). ఆయన టిమ్ కుక్ ట్వీట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Diwali is a time of light, unity, and hope. Wishing everyone celebrating a joyous and peaceful Festival of Lights! Shot on iPhone 16 Pro Max by Rohit Vohra. pic.twitter.com/zFndTguCpC
— Tim Cook (@tim_cook) November 1, 2024
Also Read..
Spain floods | స్పెయిన్‌లో వరద బీభత్సం.. 158కి పెరిగిన మృతుల సంఖ్య
Bibek Debroy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత