Sankranthiki Vasthunnam | విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో మరో క్రేజీ మూవీ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతున్నది. ఈ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా ఐశ్యర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రియురాలిగా నటిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో షూడింగ్ జరుగుతున్నది. పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా వస్తున్న ట్రయాగింల్ క్రైమ్ డ్రామాని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
మూవీకి ‘సక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌ని ఖరారు చేశారు. సినిమా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. ఫస్ట్ లుక్ పోస్టర్లో వెంకటేశ్ లుంగీ ధరించి.. గంభీరమైన భంగిమలో, స్పోర్టింగ్ షేడ్స్, తుపాకీ పట్టుకుని.. ఐశ్వర్య రాజేశ్ చీరలో.. మీనాక్షి చౌదరి మోడ్రన్ అవతార్‌లో కనిపించారు. మూవీ డబ్బింగ్ పనులు మొదలవగా.. షూటింగ్ చివరి దశకు చేరుకున్నది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జీ ఆదినారాయణ అందించగా, వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
2025 #సంక్రాంతికివస్తున్నాం ♥️✨
#SankranthikiVasthunam 💥@AnilRavipudi@Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna #SameerReddy #Tammiraju @prakash3933 @SVC_official pic.twitter.com/b9jkS7J60M
— Venkatesh Daggubati (@VenkyMama) November 1, 2024