Coffee Without Sugar | ఉదయం నిద్ర లేచిన తరువాత చాలా మంది తాగే పానీయాల్లో కాఫీ ఒకటి. ఉదయం బెడ్ టీ తాగేవారు కూడా ఉంటారు. కానీ కాఫీ ప్రియులు మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి. ఇక రోజుకు నాలుగైదు కప్పుల కాఫీని తాగేవారు కూడా ఉంటారు. అయితే మీరు కూడా కాఫీ ప్రియులే అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది మీ కోసమే. ఎందుకంటే మీరు రోజూ కాఫీని తాగుతుంటే అందులో చక్కెర కలపకుండా తాగండి. అవును, మీరు విన్నది నిజమే. కాఫీలో చక్కెర కలపకుండా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. చక్కెర కలపకుండా కాఫీని తాగితే పలు లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు.
చక్కెర లేకుండా కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు 8 శాతం వరకు తగ్గుతాయట. హార్వార్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు ఈ విషయాన్ని వెల్లడించారు. కాఫీలో చక్కెర వేసి తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయని, కానీ చక్కెర కలపకుండా కాఫీని సేవిస్తే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వారు అంటున్నారు. కనుక కాఫీని చక్కెర కలపకుండా తాగితేనే మంచిది.
చక్కెర వేయకుండా కాఫీ తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయని వెల్లడైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కాఫీలో చక్కెర కలపకుండా తాగితే గుండె జబ్బులు రావని, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని తేల్చారు. అయితే కెఫీన్‌ను మరీ ఎక్కువగా తీసుకోరాదు. కనుక కాఫీని రోజుకు 2 కప్పులకు మించకుండా తాగితేనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
మీకు మతిమరుపు సమస్య వచ్చిందా..? వయస్సు మీద పడడం వల్ల చాలా మందికి ఈ సమస్య వస్తుంటుంది. ఇది మరీ తీవ్రతరం అయితే అల్జీమర్స్ వస్తుంది. దీంతో తమ పేరును తామే మరిచిపోతారు. కానీ కాఫీలో చక్కెర కలపకుండా తాగితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అలా కాఫీ తాగడం వల్ల మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుందని అంటున్నారు.
అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి కాఫీ ఎంతగానో మేలు చేస్తుంది. అయితే కాఫీని చక్కెర లేకుండా తాగాల్సి ఉంటుంది. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనే జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. కాఫీలో చక్కెర లేకుండా సేవించడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుందని అంటున్నారు. అలాగే ఫ్యాటీ లివర్ అనే సమస్య వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక మీరు కాఫీని ఇకపై ఎప్పుడు తాగినా చక్కెర లేకుండా తాగండి. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.