Mark Zuckerberg | ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ (Halloween) వేడుకలు ఏటా అక్టోబర్ 31న నిర్వహించుకుంటారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రజల వేషధారణ ఎంతో విభిన్నంగా ఉంటుంది. చిన్నారులు, యువత విచిత్రమైన దుస్తులు ధరించి అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దెయ్యాలు, రాక్షసుల మాదిరి రకరకాల ఆకృతుల్లో అలంకరించుకొని.. ఇరుగుపొరుగు అంతా కలిసి రాత్రి సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా హాలోవీన్ వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఇక మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫ్యామిలీ కూడా అక్టోబర్ నైట్ ఈ హాలోవీన్ వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ దంపతులు, ముగ్గురు పిల్లలు విచిత్ర వేషధారణతో భయపెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మార్క్ జుకర్ బర్గ్ హాలీవుడ్ చిత్రం ‘జాన్ విక్’ (John Wick)లోని హంతకుడి పాత్రను గెటప్‌గా వేసుకోగా.. ఆయన భార్య, పిల్లలు మాత్రం మహిళా బాలెట్ డ్యాన్సర్ (బాలెరినా) దుస్తుల్లో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జుకర్ బర్గ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇంట్లో ఉన్న వాళ్లంతా బెలెరినాస్గా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు.. మీరు జాన్ విక్‌గా మారండి అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఒకప్పుడు ఈ హాలోవీన్ సంస్కృతి విదేశాలకు మాత్రమే పరిమితం అయి ఉండేంది. ఇప్పుడు మన దగ్గర కూడా బాగా విస్తరించింది. దేశంలోని పాఠశాలల్లో కూడా ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. అక్టోబరు 31 రాత్రి హాలోవీన్ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు భయానక దుస్తుల్లో కనిపిస్తారు. ఆత్మల లోకం, మన ప్రపంచం మధ్య ఉన్న గోడ బలహీనంగా మారినప్పుడు దురదృష్టకరమైన లేదా దుష్టశక్తులు భూమిలోకి ప్రవేశిస్తాయని, మానవులకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తాయని చెబుతారు.
Also Read..
England Cricket Board | ఇంగ్లండ్ స్టార్లకు సెంట్రల్ కాంట్రాక్ట్.. 29 మందిలో ఉన్నది వీళ్లే..!
Jupalli Krishnarao | నాగార్జునసాగర్‌లో స్టార్ హోటల్ నిర్మిస్తాం : మంత్రి జూపల్లి
Children Dead | ఇద్దరు పిల్లలు మృతి.. క్షుద్రపూజల కోసం చంపినట్లు పేరెంట్స్ అనుమానం