హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణలేకుండా పోయింది. రాష్ట్రంలో అత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. భూకబ్జాలు, రౌడీయిజం సరేసరి. రేవంత్ రెడ్డి పాలనలో లాండ్ ఆర్డర్ అనేది లేకుండాపోయింది. తాజాగా గిరిజన మహిళపై(Tribal woman) ఓ కాంగ్రెస్ నాయకుడు (Congress leader) లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా వేములపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత మహిళపై కాంగ్రెస్ నాయకుడు గంట కృష్ణయ్య లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్థాపానికి గురైన సదరు మహిళ పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేటలోని హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి హైదరాబాద్ కామినేని హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.