హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు(Double bedroom houses) ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి పలువునిరిని మోసం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీ కాలనీలో(KPHB colony) వేణుగోపాల్ దాస్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు, తాళాలు చూపించి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తానని 15 మంది బాధితులను బురిడీ కొట్టించాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.లక్షా 70 వేల నుంచి 2.5 లక్షలు వసూలు చేశాడు. వేణుగోపాల్ ఇచ్చిన తాళాలు తీసుకొని ఇండ్లకు వెళ్తే.. ఇండ్లలో అసలైన లబ్ధిదారులు ఉండటంతో విస్తుపోవడం బాధితుల వంతయింది. మోసపోయామని గ్రహించిన బాధితులు వేణుగోపాల్ దాస్‌పై కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Kerala Festival: కేరళ ఉత్సవంలో పేలిన బాణాసంచా.. 150 మందికి గాయాలు
Kerala CM | కేరళ సీఎంకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ.. VIDEO
Jammu and Kashmir: ఆక్నూర్ ఆపరేషన్‌లో ఇద్దరు మిలిటెంట్లు కాల్చివేత..