Kerala CM | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (convoy collided). ఈ ఘటన తిరువనంతపురం (Thiruvananthapuram)లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రమాదంలో సీఎం సహా సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేదు. వాహనాలకు మాత్రం స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
సీఎం విజయన్ సోమవారం సాయంత్రం కొట్టాయం సందర్శనకు వెళ్లి తిరిగి రాజధానికి వస్తున్న సమయంలో వామనాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ సడెన్‌గా రైట్ తీసుకోబోతుండగా.. అప్రమత్తమైన కాన్వాయ్‌లోని ముందు వెళ్తున్న పైలట్ వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనుక ఉన్న సీఎం కారు, అంబులెన్స్ సహా ఆరు ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సీఎం వాహనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో సీఎం, ఇతర సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
यह काफिला केरल के मुख्यमंत्री का है। pic.twitter.com/MxahkVUhoY
— Hiren (@hdraval93) October 28, 2024
Also Read..
Walking Daily 30 Minutes | రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే చాలు.. ఆయుష్షు పెరుగుతుందట..!