Walking Daily 30 Minutes | మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కచ్చితంగా సరైన జీవన విధానాన్ని పాటించాలి. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. వేళకు భోజనం చేయాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాలి. అయితే వ్యాయామం విషయానికి వస్తే జిమ్‌కు వెళ్లి భారీ బరువులను మోస్తూ కష్టతరమైన వ్యాయామాలను చేయాల్సిన పనిలేదు. అలా అని చెప్పి బయట రన్నింగ్, జాగింగ్ కూడా కష్టంగా చేయాల్సిన పనిలేదు. రోజూ కేవలం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు.. ఎంతో ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వాకింగ్ చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని వారంటున్నారు.
సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల ప్రకారం రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేసే వారి ఆయుర్దాయం గణనీయంగా పెరిగందని తేలింది. వాకింగ్ చేయడం వల్ల ఆయుష్షును పెంచుకోవచ్చని వారంటున్నారు. అలాగే అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చని వారు చెబుతున్నారు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయగలిగితే ఆయుష్షును పెంచుకోవడంతోపాటు రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.
వాకింగ్ అనేది లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ కిందకు వస్తుంది. దీనికి ప్రత్యేకమైన జిమ్ సాధనాలు అంటూ ఏమీ అవసరం ఉండదు. ఎప్పుడైనా, ఎవరైనా ఈజీగా చేయవచ్చు. కనుకనే వాకింగ్ వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుందని వారంటున్నారు. వాకింగ్ చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే తీవ్రమైన రోగాల బారి నుంచి రక్షణ పొందవచ్చు. దీంతోపాటు గుండె ఆరోగ్యం మెరుగు పడుతుఉంది.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే గుండె పోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తేలింది. అలాగే స్ట్రోక్స్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ వాకింగ్ చేయడం వల్ల బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. వాకింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. వాకింగ్ చేస్తే మూడ్ మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రాత్రిపూట చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
వాకింగ్ చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ముఖ్యంగా వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్‌కు చెక్ పెట్టవచ్చు. కీళ్లు, మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా వాకింగ్ చేయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని, కనుక ప్రతి ఒక్కరూ రోజూ భారీగా వ్యాయామాలు చేయాల్సిన పనిలేకుండా కేవలం 30 నిమిషాల పాటు అయినా సరే వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.