– ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, ఫిబ్రవరి 18 : ప్రభుత్వం నుండి మంజూరైన వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకువాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నుండి రూ.1.16 కోట్లతో సబ్సిడీ కింద మంజూరు అయిన వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో విలువైన యంత్ర పరికరాలను అందజేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శ్రీలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ జామున మాధవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పున్న సైలజ వెంకటేష్, వైస్ చైర్మన్ జుబేరియ్ తుభసుమ్, నర్సింహా, అరుణ సురేష్ గౌడ్, సాయి చంద్ర, వేణుధర్ రెడ్డి, ఏఓ రవికుమార్, లక్పతి పాల్గొన్నారు.