Maoists surrender | ఝార్ఖండ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగలింది. ఐదుగురు మహిళలతో సహా 16 మంది మావోయి స్టులు(Maoists, Surrender) మంగళవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో పోలీసుల ఎదుట లొంగిపో యారు. పలు ఆయుధాలను అప్పగించారు. అందులో రెండు ఏకే-47 రైఫిల్స్ ఉన్నాయి. లొంగిపోయిన వారిలో ఆరుగురిపై మొత్తం రూ. 39 లక్షల రివార్డు ఉందని సీనియర్ అధికారి తెలిపారు. లొంగిపోయిన వారిలో సంతోష్ మహతో అలియాస్ వాసుదేవ్ కూడా ఉన్నారని, ఇతనిపై 128 కేసులు నమోదై ఉన్నాయని మరియు రూ. 15 లక్షల రివార్డు ఉందని ఆయన పేర్కొన్నారు.
వీరిలో ఐదుగురు మహిళా సభ్యులు కూడా ఉన్నారు. నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) ప్రాంతీయ కమిటీ సభ్యుడైన సంతోష్ మహతో లొంగిపోవడం జార్ఖండ్ పోలీసులకు ఒక గొప్ప విజయమని జార్ఖండ్ డీజీపీ తదాష మిశ్రా పేర్కొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 128 కేసుల్లో సంతోష్ నిందితుడిగా ఉన్నాడు. లొంగిపోయిన మవోస్టులందరికి చట్టపరంగా పునరావాసం కల్పిస్తామన్నారు. రాష్ట్రాన్ని నేరరహితంగా మార్చేందుకు జార్ఖండ్ పోలీసులు నిబద్ధతతో పని చేస్తున్నారని డీజీపీ తెలిపారు.