Esha Singh: 25మీ పిస్తోల్ ఈవెంట్లో షూటర్ ఈషా సింగ్‌కు సిల్వర్ మెడల్
Esha Singh : భారత యువ షూటర్ ఈషా సింగ్ .. సిల్వర్ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నది. జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ .. 25 మీటర్ల పిస్తోల్ సింగిల్స్ ఈవెంట్లో ఆమె ఆ మెడల్ కొట్టింది. ఫైనల్లో స్వర్ణ పతకం కోసం ఈషా తీవ్రంగా పోరాడింది.
నగోయా: ఏషియన్ గేమ్స్‌లో భారత షూటర్ ఈషా సింగ్ రజత పతకం గెలుచుకున్నది. 25 మీటర్ల పిస్తోల్ సింగిల్స్ ఈవెంట్లో ఆమె ఆ పతకాన్ని కైవసం చేసుకున్నది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో.. గోల్డ్ మెడల్ కోసం ఈషా సింగ్ టఫ్ ఫైట్ ఇచ్చింది. టీమ్ ఈవెంట్లో విఫలమైన ఈషా సింగ్.. వ్యక్తిగత 25మీ పిస్తోల్ ఈవెంట్లో మాత్రం తన సత్తా చాటింది. నార్త్ కొరియా క్రీడాకారిణి కిమ్ హోన్ సుక్తో జరిగిన మూడు షూట్ ఆఫ్ గేమ్స్‌లో గట్టెక్కిన ఈషా.. చైనా క్రీడాకారణి జియో జియారుగ్జాన్తో జరిగిన రెండో షూట్ ఆఫ్‌లో 4-3 తేడాతో ఓడిపోయింది. దీంతో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకునే అవకాశాన్ని ఈషా కోల్పోయింది. ఫైనల్స్ క్వాలిఫయింగ్ రౌండ్లో 8వ స్థానంలో ఉన్న యువ షూటర్ ఈషా.. అసాధారణ పోరాట స్పూర్తిని ప్రదర్శించింది. పోటాపోటీగా అయిదు సార్లు జరిగిన షూట్ ఆఫ్ ఈవెంట్లను ఆమె గెలుచుకోవడం గమనార్హం. 38-38 స్కోరుతో టై అయిన సమయంలో షూట్ ఆఫ్స్ జరిగాయి.
Silver for India! 🇮🇳🥈
Esha Singh delivers a superb performance to win silver in the women’s 25m pistol event at the Asian Games 2026.
Composed under pressure and fighting right till the end, she earns another proud moment for Indian shooting.
Congratulations, Esha! 🇮🇳… pic.twitter.com/LLJKWIcHBM
— Kiren Rijiju (@KirenRijiju) September 28, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

