Kodangal | సీఎం ఇలాకాలో బుల్డోజర్ల విధ్వంసం.. కొడంగల్‌లో 84 ఇళ్లు, దుకాణాలు కూల్చివేత
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్‌లో బుల్డోజర్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రోడ్ల విస్తరణ పేరుతో ఇల్లు, దుకాణాలను కూల్చివేస్తున్నారు.
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్‌లో బుల్డోజర్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రోడ్ల విస్తరణ పేరుతో ఇల్లు, దుకాణాలను కూల్చివేస్తున్నారు. ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకుండా పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుని నిర్మించుకున్న ఇళ్లు, దుకాణాలు కళ్లముందే కూలిపోవడంతో అనేక కుటుంబాలు నిలువ నీడ లేక రోడ్డునపడుతున్నాయి.
రోడ్డు విస్తరణ కోసం తమ ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేయడంపై బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Kodangal2
పరిహారం, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. దీంతో కూల్చివేతల ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పహారా మధ్య బుల్డోజర్లతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Kodangal3
చిన్న మండల కేంద్రంలో ఇంత పెద్ద రోడ్డెందుకు?
చిన్న మండల కేంద్రంలో అంత పెద్ద రోడ్డు విస్తరణ ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు విస్తరణ అంత అవసరమైతే బైపాస్ రహదారి ఏర్పాటు చేస్తే సరిపోయేదని అంటున్నారు. ఉన్న రోడ్లను సరిగా అభివృద్ధి చేయలేని ప్రభుత్వం.. కొత్త రోడ్డు పేరుతో సీఎం నియోజకవర్గంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముతో నిర్మించుకున్న ఆశల సౌధాలు కళ్లముందే కూలిపోతుండటంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయి. ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేతలు చేపట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kodangal4
ఆందోళనకు శ్రీకారం చుడతాం: పట్నం నరేందర్‌రెడ్డి
పేదల ఇళ్లకు పరిహారం చెల్లించి, ప్రత్యామ్నాయంగా ప్లాట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులకు పరిహారం, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఆందోళనకు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. దీంతో కొడంగల్ నియోజకవర్గంలో కూల్చివేతల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీస్తోంది
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

