Ujjain: షాహి మసీదు తొలగింపు.. ఉజ్జయినిలో పోలీసులతో ఘర్షణ
Ujjain: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పోలీసులకు, ఓ వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. ఆ పట్టణంలో ఉన్న షాహి మసీదుకు చెందిన కొంత భాగాన్ని తొలగించాలని భావించారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం ఆందోళన చేపట్టంది. ఆ సమయంలో కొందరు రాళ్లు రువ్వగా, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని(Ujjain)లో పోలీసులకు, ఓ వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. ఆ నగరంలో ఉన్న షాహి మసీదుకు చెందిన కొంత భాగాన్ని తొలగించాలని భావించారు. రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా మసీదులో కొంత నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం ఆందోళన చేపట్టంది. భారీ స్థాయిలో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఓ వర్గానికి చెందిన ప్రజలు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
మసీదు కాంప్లెక్స్ సమీపంలో భారీ స్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. సిటీలో కంతల్ స్క్వేర్ నుంచి గోపాల్ మందిర్ వరకు సుమారు 900 మీటర్ల మేర రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టారు. 2028లో జరిగే సింహస్తా ఈవెంట్ కోసం రోడ్డును సుమారు 15 మీటర్ల వెడల్పుతో విస్తరణ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఆలైన్‌మెంట్‌లో భాగమైన అనేక మతపరమైన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ మార్గంలో ఇప్పటికే ఇలాంటి 60 నిర్మాణాలను తొలగించినట్లు అధికారులు చెప్పారు.
కానీ షాహి మసీదుతో పాటు ఖడే హనుమాన్ మందిర్ సమీపంలో ఉన్న మజర్ వల్ల రోడ్డు వెడల్పు కార్యక్రమం నిలిచిపోయింది. షాహి మసీదు శతాబ్ధాల నాటి వక్ఫ్ ప్రాపర్టీ అని ఆ వర్గ ప్రజలు వాదిస్తున్నారు. అయితే ఆ మసీదుకు చెందిన ప్రార్థన హాల్, మినార్ ప్రస్తుత విస్తరణలో భాగంగా కూల్చనున్నారు. ఆదివారం నుంచి అక్కడ 2 వేల మంది పోలీసుల్ని మోహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

