Ganga Reddy | జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సన్నిహితుడు మారు గంగారెడ్డి ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం విదితమే. తన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సోమవారం రాత్రి జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో గంగారెడ్డి కుటుంబాన్నిఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. గంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గంగారెడ్డి సోదరి రాధ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంత్రి శ్రీధర్ బాబు ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తమ్ముడి హత్యతో మేం మానసికంగా చనిపోతున్నాం. ఆ పిల్లలు ఇప్పుడు ఎవరిపై ఆధారపడాలి. దారి వెంట పోతున్న మా తమ్ముడిపై అన్ని పోట్లు పొడిచి చంపిండంటే.. మేం ఉన్న చనిపోయినట్టే. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు..? వాళ్ల కళ్లు మూసుకుపోయాయా..? పోలీసోళ్లు ఇప్పుడొచ్చి ఇక్కడ లైన్ కడితే మా తమ్ముడు తిరిగి వస్తడా..? మేం చేయబట్టి రేవంత్ అనేటోడు సీఎం అయిండు అని రాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంను అంతమాట అనొద్దమ్మా అని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతుండగా.. మళ్లీ ఆమె ఫైర్ అయ్యారు. ఏం మాట అనొద్దు.. అనొద్దు అనొద్దు అనుకుంట మా నోరు బంద్ చేపిస్తున్నరు. మాకు ఎంత బాధ అనిపిస్తది. జీవన్ అన్న వెంట 40 ఏండ్ల నుంచి ఉంటున్నాం అని రాధ ఆవేదన వ్యక్తం చేశారు.
గత గవర్నమెంట్లో మంచిగా ఉన్నాం.. మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బతుకుతున్నాం అంటూ అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన మారు గంగారెడ్డి సోదరి రాధ
అసలు రేవంత్ రెడ్డి అనేటోడు మేము చెయ్యవట్టి సీఎం అయ్యాడు.
గత గవర్నమెంట్లో మంచిగా ఉన్నాం.. మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బ్రతుకుతున్నాం అంటూ మండిపడ్డ హత్యకు గురైన కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి సోదరి రాధ. https://t.co/fJr2G3Gytj pic.twitter.com/EVt8SoWD4D
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2024
ఇవి కూడా చదవండి..
CM Security | అంగరక్షకులపైనే అనుమానం? సీఎం సెక్యూరిటీలో బెటాలియన్ పోలీసుల తొలగింపు
KTR | విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు తిరస్కరణ.. ఇది తెలంగాణ ప్రజల విజయం : కేటీఆర్
CM Revanth Reddy | పాలనా వైఫల్యం నుంచి బయటపడేదెలా..? ఇద్దరు మంత్రులతో సీఎం రోజంతా మంతనాలు