KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్ శ్రీ రంగారావు, సభ్యులు మనోహర్ రాజు, కృష్ణయ్యకు తెలంగాణ ప్రజల తరపున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
విద్యుత్ చార్జీల పేరిట రూ. 18,500 కోట్ల అదనపు భారం ప్రజలపై మోపడాన్ని హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో నిర్వహించిన మూడు బహిరంగ విచారణలలో తాము తీవ్రంగా వ్యతిరేకించామని కేటీఆర్ తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల విజయం అని కేటీఆర్ పేర్కొన్నారు.
On behalf of the people of Telangana, I sincerely thank the Chairman and Members of the Telangana Electricity Regulatory Commission Sri Ranga Rao Garu, Manohar Raju Garu and Krishnaiah Garu for rejecting the proposed power tariff hike by Congress Government
₹ 18,500 Crore was… https://t.co/rtz1jh2ZBv
— KTR (@KTRBRS) October 29, 2024
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | పాలనా వైఫల్యం నుంచి బయటపడేదెలా..? ఇద్దరు మంత్రులతో సీఎం రోజంతా మంతనాలు
Telangana Secretariat | సచివాలయ సిబ్బందిపై నిఘా.. సోషల్ మీడియా పోస్టులపైనా దృష్టి