బిజీ లైఫ్ ైస్టెల్, ట్రావెలింగ్, బహిరంగ ప్రదేశాల్లో టాయిలెట్స్ శుభ్రంగా లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల చాలామంది బయటికి వెళ్తే.. సకాలంలో మూత్ర విసర్జన చేయరు. కానీ ఎకువసేపు లేదా పదే పదే మూత్రాన్ని ఆపుకోవడం మన ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు మూత్ర నాళాన్ని దెబ్బతీయడమే కాకుండా తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది.
తర్వాత వెళ్లొచ్చులే అని మూత్రాన్ని ఆపుకునే అలవాటు మీ మూత్రపిండాల వ్యవస్థను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. మూత్రాశయం నిండినప్పుడు మూత్రవిసర్జనకు మెదడు సందేశాన్ని పంపుతుంది. దానిని పెడచెవిన పెట్టి… విసర్జించకుండా ఉంటే దీర్ఘకాలంలో కిడ్నీలు, మూత్రాశయం, మూత్ర వ్యవస్థ దెబ్బతింటాయి. మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం వల్ల మూత్రాశయంపై అధిక ఒత్తిడి ఏర్పడి అక్కడ ఉండే కండరాలు బలహీనమవుతాయి. మూత్రాశయం అతిగా సాగడం వల్ల దాని కండరాల పటుత్వం తగ్గిపోయి మూత్రం లీక్ అవుతుంది. మూత్రాన్ని చాలాసార్లు ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇది క్రమంగా మూత్రనాళాల ఇన్ఫెక్షన్కు సైతం దారితీస్తుంది. దీంతో మంట, మూత్రంలో దుర్వాసన, జ్వరం వంటి లక్షణాలు ఏర్పడతాయి. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్కు చికిత్స చేయకపోతే అది కిడ్నీలను ప్రభావితం చేస్తుంది. మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం వల్ల కిడ్నీల్లో లవణాలు పేరుకుపోయి.. రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది.
ఇన్ఫెక్షన్లు, పక తడపడం, బ్లాడర్ కండరాలు బలహీనపడటం వంటి సమస్యలు చిన్నపిల్లలో తలెత్తుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు, కండరాల నొప్పి, బ్లాడర్ స్ట్రెచింగ్, లాంటి సమస్యలు పెద్దవారిలో వస్తుంటాయి. అందుకే మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికోసం కొన్ని చిటాల్ని పాటించాలి. మీ శరీరం ఇచ్చే సంకేతాల్ని తప్పక వినండి. మూత్రం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లండి. తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఈ అలవాటు వల్ల మూత్రం పలుచగా ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్ల భయం తగ్గుతుంది. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం మంచిది. నీరు తకువైతే మూత్రం గాఢత పెరిగి మంట పుడుతుంది. మూత్ర విసర్జన చేసే సమయంలో పూర్తిగా యూరిన్ ఖాళీ అయ్యేలా చూసుకోండి. మూత్రాశయాన్ని చికాకు పెట్టే టీ, కాఫీలను పరిమితిలో తీసుకోండి. ప్రతీ మూడు గంటలకు ఒకసారి మూత్రవిసర్జన చేయడానికి ప్రయత్నించండి. ఇన్ఫెక్షన్లు రాకుండా జననేంద్రియ భాగాలను శుభ్రంగా ఉంచుకోండి.