ఎముకలు ఎందుకు వంగిపోతున్నాయి?
మా అబ్బాయికి వెన్నులో ఎముక వంకరగా ఉండటం చిన్నప్పుడే గమనించాం. ఎముకలు బయటికి వస్తున్నట్టుగా, ఛాతీ లోపలికి పోతున్నట్టుగా కనిపించింది. నడిచే వయసు వచ్చేసరికి ఆ సమస్య పెరిగింది. మూడు, నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి అబ్బాయి మెడ ఒక వైపు వంచి నడుస్తున్నాడు.
- పిల్లల పెంపకం
మా అబ్బాయికి వెన్నులో ఎముక వంకరగా ఉండటం చిన్నప్పుడే గమనించాం. ఎముకలు బయటికి వస్తున్నట్టుగా, ఛాతీ లోపలికి పోతున్నట్టుగా కనిపించింది. నడిచే వయసు వచ్చేసరికి ఆ సమస్య పెరిగింది. మూడు, నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి అబ్బాయి మెడ ఒక వైపు వంచి నడుస్తున్నాడు. డాక్టర్లకు చూపిస్తే.. అబ్బాయి చిన్నగా ఉన్నందున ఆపరేషన్ చేయలేమని అన్నారు. కొందరు డాక్టర్లు ఆపరేషన్ త్వరగా చేయాలని చెప్పారు. అబ్బాయి కాలి నడక, కాలి బలంలో ఏ ఇబ్బందీ లేదు. వేరే అనారోగ్య సమస్యలూ లేవు. అబ్బాయి పెరుగుతున్న కొద్దీ వెన్నెముక ఒకవైపు వంగుతున్న మార్పులు చూస్తున్నాం. మా అబ్బాయి జీవితాంతం ఇలా ఇబ్బందిపడాల్సిందేనా? సమాజంలో తిరగడానికి, బయటవాళ్లు చూస్తే ఏమనుకుంటారోనని మాకు ఇబ్బందిగా ఉంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది? చికిత్సకు సరైన వయసు ఏది? కొందరు డాక్టర్లు బ్రేస్ వాడమన్నారు. బ్రేస్ పెట్టుకోవడానికి ఇబ్బంది పెడుతున్నాడు. ఏ చికిత్స బాగుంటుంది?
మీ అబ్బాయికి ఉన్న సమస్యను (వెన్ను వంగిపోవడాన్ని) ‘స్కోలియోసిస్’ అంటారు. ఈ సమస్య అనేక కారణాల వల్ల రావొచ్చు. ఎముకల అమరిక సరిగా లేకపోతే.. పుట్టుకతోనే స్కోలియోసిస్ వస్తుంది. ఎముక నిర్మాణం సరిగా జరుగకపోవడం వల్ల చిన్న వయసులో వెన్ను వంకరపోతుంటుంది. వయసు పెరిగే కొద్దీ సమస్య పెరుగుతూ ఉంటుంది. బాధితుల్లో ఎముకల అమరిక ఎలా ఉందో తెలుసుకునేందుకు, స్కోలియోసిస్ తీవ్రతను గుర్తించేందుకు ఎక్స్రే తీస్తారు. దీని ఆధారంగా భవిష్యత్లో ఎముక ఆకారం ఎలా ఉంటుందో అవగాహన వస్తుంది. స్కోలియోసిస్ సమస్య తీవ్రంగా ఉంటే (ఎముకల వంకర 30 డిగ్రీలు దాటితే) వారి వయసు 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు శస్త్ర చికిత్స చేయాలి. ఒకవేళ స్కోలియోసిస్ యాంగిల్స్ స్థిరంగా ఉండి, ఏ సమస్య రాకుండా ఉంటే, పదహారు, పదిహేడేళ్లు (ఎదుగుదల పూర్తి అయ్యే వరకు) వచ్చే వరకు ఎముకల ఎదుగుదలను గమనిస్తూ ఉండాలి.
ఏ ఇబ్బంది లేకపోతే చికిత్స చేయాల్సిన అవసరం ఉండదు. స్కోలియోసిస్ బారినపడ్డ చిన్న పిల్లల్లో కొందరికి బ్రేస్ ఉపయోగించాలి. పిల్లలు బ్రేస్ ధరించడం కష్టం. వాళ్లను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ బ్రేస్ తొడగాలి. ప్రతి రోజూ సమయం పెంచుతూ పోవాలి. కొంతమంది పిల్లలకు పది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో స్కోలియోసిస్ వస్తుంది. దీనిని అడలోసెంట్ ఇడియోపథిక్ స్కోలియోసిస్ అంటారు. ఇది ఎందుకు వస్తుందో తెలియదు. ఇది కొందరు పిల్లల్లో వేగంగా పెరుగుతుంది. కొందరిలో అంతగా పెరగదు. ఎవరిలో వేగంగా పెరుగుతుందో వాళ్లకు బ్రేసింగ్ వాడాలి. ఎముకల్లో వంపు 30-40 డిగ్రీలకు వచ్చినపుడు బ్రేసింగ్ ధరించడం మొదలుపెట్టాలి. బ్రేసింగ్ చేయడం వల్ల సమస్య అంతకుమించి పెరగకుండా ఆగుతుంది. 40 డిగ్రీలకు వచ్చినప్పుడు స్కోలియోసిస్ చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి సర్జరీ చేస్తే సరి అవుతుంది.
డాక్టర్ కొక్కుల ప్రణీత్
పీడియాట్రిక్ న్యూరో సర్జన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

