తిరువనంతపురం: కేరళలోని అంజుతాంబలం వీరేర్కావు ఆలయంలో(Kerala Festival) సోమవారం రాత్రి బాణాసంచా పేల్చిన సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సుమారు 150 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని కాసర్గడ్, కన్నూర్, మంగళూరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. నీలేశ్వరంలోని వీరేర్కావు ఆలయం వద్ద నిల్వ ఉంచిన బాణాసంచా వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కాసర్గడ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రస్తుతం 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. తీయం ఉత్సవంలో భాగంగా జరుగుతున్న సంబరాల వేళ విషాద ఘటన చోటుచేసుకున్నది.
#BREAKING A devastating fire incident occurred during the fireworks display at the Veerabhadra Temple festival in Neeleswaram, Kasaragod district of Kerala, resulting in injuries to 154 individuals, with 10 people reported in critical condition. pic.twitter.com/dBKtsyygh9
— Mahalingam Ponnusamy (@mahajournalist) October 29, 2024
అర్థరాత్రి వేళ ఫైర్‌క్రాకర్స్ కాల్చారని, అయితే ఆ బాంబు నిప్పు.. సమీప షెడ్డులో ఉన్న బాణాసంచాపై పడి ఉంటుందని, దాని వల్ల ప్రమాదం భారీగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. షెడ్డు నుంచి భారీ స్థాయిలో మంటలు, పొగ రావడంతో.. ఉత్సవానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉత్సవం వేళ కాల్చేందుకు చైనీస్ బాణాసంచా తీసుకువచ్చామని, క్రాకర్స్ పేల్చుతున్న సమయంలో ఓ నిప్పురవ్వ షెడ్డుపై పడి ఉంటుందని అంటున్నారు.
ఆలయ కమిటీ ప్రెసిడెంట్‌తో పాటు కార్యదర్శిని పోలీసులు అరెస్టు చేశారు. కులిచి తొట్టం వేడుక కోసం సుమారు 24వేల ఖరీదైన బాణాసంచా కొనుగోలు చేసినట్లు ఆలయ కమిటీ పోలీసులకు తెలియజేసింది. వార్షిక వేడుకను వీక్షించేందుకు వేల సంఖ్యలో జనం హాజరయ్యారు. అయితే బాణాసంచా కార్టన్ పేలడంతో.. జనం ఉరుకులు పరుగులు తీశారు. ఆ సమయంలో ఒకరిపై ఒకరు పడిపోయారు.