Hyderabad | హైదరాబాద్ : బేగంపేటలోని ప్రజా భవన్‌కు సమీపంలోని పెట్రోల్ బంక్‌లో మంటలు చెలరేగాయి. శుక్రవారం మధ్యాహ్నం బంక్‌లోని ఓ భూగర్భ ట్యాంక్ మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులు భయంతో పరుగులు తీశారు. రోడ్డు పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో రోడ్డు మార్గానా వెళ్లేవారు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది భూగర్భ ట్యాంకులో చెలరేగిన మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తి నష్టం కూడా సంభవించలేదు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అటు పెట్రోల్ బంక్ యాజమాన్యం, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.
ఇవి కూడా చదవండి..
KTR | అసెంబ్లీలో మేం ఎలాంటి వీడియోలు తీయలేదు.. సభకు తెలిపిన కేటీఆర్