హైదరాబాద్: కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు తర్వాత సంగతి సీఎం రేవంత్ అమెరికా వెళ్లి వచ్చే వరకు ఆయన సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చురకలంటించారు. ఖమ్మం, నల్లగొండ మంత్రులు ఆయన సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి బెదిరిస్తే ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ.. అమెరికా వెళ్లి వచ్చేవరకు మీ సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోవాలంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. హుజురాబాద్ ప్రజలకు రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలన్నారు. హుజురాబాద్లో అగ్నిప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించలేదన్నారు. తన జీతం నుంచి బాధితులకు రూ.4 లక్షలు ఇచ్చానని చెప్పారు. హుజురాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మిత్రుడు మీడియా వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం రద్దు అయ్యేలా ఉంది
ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు
ముఖ్యమంత్రి బెదిరిస్తే భయపడే వాళ్ళు లేరు.. సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన సీఎం క్షమాపణ చెప్పాలి… pic.twitter.com/8YsF1mHaqV
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024