KTR | హైదరాబాద్ : ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో వీడియోలు తీశారని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ నిర్వహణ సమయంలో మేం ఎలాంటి వీడియోలు తీయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా చట్టాలు వస్తున్నాయి. కేంద్రం తీసుకొస్తున్న కొన్ని చట్టాల వల్ల పోలీసు రాజ్యం వచ్చే ప్రమాదం ఉందని కొన్ని సవరణలు తీసుకువస్తే బాగుంటుందని సూచించాం తప్ప ఇంకో మాట మాట్లడలేదు. వారు(మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి) ఇంకో మాట అన్నారు.. అక్కడ్నుంచి వీడియోలు తీశారని.. మా వైపు నుండి అలాంటిది ఏమీ జరగలేదు అని కేటీఆర్ తెలిపారు.
ఇక్కడ కెమెరాలు అన్ని స్పీకర్ ఆధీనంలోనే ఉంటాయి.. మీరు కావాలంటే మొత్తం చెక్ చేయండి మా వల్ల జరిగిందా? ఇక్కడున్న కెమెరాలు నడుపుతున్న ఏజెన్సీ వల్ల జరిగిందా చెక్ చేసుకోండి.. ప్రభుత్వం చట్టపరంగా ఏమైనా చర్య తీసుకోవాలన్న తీసుకోవచ్చు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని నుంచి సీఎంలు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, స్పీకర్ల మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఎవరు అతీతులు కాదు. నెహ్రూ పాలన నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. అందరం బాధితులమే అని కేటీఆర్ తెలిపారు.
అసెంబ్లీలో వీడియోలు తీశారు అంటున్నారు.. మా వైపు నుండి అలాంటిది ఏమీ జరగలేదు
ఇక్కడ కెమెరాలు అన్ని స్పీకర్ ఆధీనంలోనే ఉంటాయి.. మీరు కావాలంటే మొత్తం చెక్ చేయండి మా వల్ల జరిగిందా? ఇక్కడున్న కెమెరాలు నడుపుతున్న ఏజెన్సీ వల్ల జరిగిందా చూసుకోండి.
ప్రభుత్వం చట్టపరంగా ఏమైనా చర్య… pic.twitter.com/85PoNO5TTa
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024
ఇవి కూడా చదవండి..
KTR | తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు.. స్వాగతిస్తున్నామన్న కేటీఆర్
KTR | ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే : ఎమ్మెల్యే కేటీఆర్