Dhoolpet | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేటలో ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి శనివారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ధూల్‌పేటలోని ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు. గంజాయి వినియోగం పెరగడంతో.. అమ్మకాలకు సంబంధించిన 37 అనుమానిత ప్రాంతాలను పోలీసులు గుర్తించారు.
గంజాయి కోసం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు ముందు జాగ్రత్త పడడంతో గంజాయి పట్టుబడలేదు. గంజాయి కోసం అమ్మకందారుల వద్దకు వచ్చిన కొనుగోలుదారులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు జాయింట్ కమిషనర్ల పర్యవేక్షణలో ఇంటింట సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో జాయింట్ కమిషనర్లు ఖురేషియా శాస్త్రి, ఈఈ ఎస్ విజయ్, ఏఎస్‌లు శ్రీనివాసరావు, సౌజన్య, ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్ ఇంచార్జ్ మధు బాబు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..
Gun Miss Fire | నార్సింగిలో తుపాకీ మిస్ ఫైర్.. బెడ్రూంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
boianpalli vinod kumar | పార్టీ మారుతున్న వాళ్లను చూసి బాధపడక్కర్లేదు: బోయిన్పల్లి వినోద్‌కుమార్
షాద్‌నగర్ రియల్టర్ హత్య కేసులో ట్విస్ట్.. పెద్ద కొడుకే అసలు సూత్రధారి!
MLA Arekapudi Gandhi | కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే