Aasara Pension | ఇన్నేళ్లుగా తీసుకున్న పెన్షన్ డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి.. 80 ఏండ్ల బామ్మకు రేవంత్ సర్కార్ నోటీసులు
కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని విమర్షించారు.
Aasara Pension | హైదరాబాద్: ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ కొత్తగూడెం జిల్లా దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులివ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుందని చెప్పారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని విమర్షించారు.
ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏండ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన రూ.లక్షా 72 వేలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విమర్శించారు. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని హెచ్చరించారు.
కొండ నాలుకకు మందేస్తే
ఉన్న నాలిక ఊడినట్టుంది!కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది.
ఏవో సాంకేతిక… pic.twitter.com/tQadMKcvuz
— KTR (@KTRBRS) July 13, 2024
కొత్తగూడెం జిల్లాలో ఆసరా పెన్షన్లపై ఇటీవల సర్వే నిర్వహించగా దాసరి మల్లమ్మ ఆసరా పెన్షన్‌కి అనర్హురాలు అని.. ఇప్పటివరకు ఆమె తీసుకున్న రూ. 1,72,928 తిరిగి ప్రభుత్వానికి 7 రోజుల లోగా చెల్లించాలని అధికారులు ఆమెకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

