Harish Rao | రాష్ట్రంలో మరో అవినీతి బయట పెట్టామని.. అబ్కారీ శాఖలో అవినీతి జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. చిట్‌చాట్‌లో ఈ అంశంపై హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ 110అప్లికేషన్లు వచ్చాయి. 110 అప్లికేషన్లలలో 25 ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మంత్రి కోటా 4, ముఖ్య నేత కోటా 21 సెలెక్ట్ చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా25 మొదట ఇస్తారట.. ఈ మధ్య ముఖ్య నేతకు తోడై, నీడై, ఇంట్లోనే ఉంటాడు ఆ నాయకుడు. ఈ మధ్య వార్తల్లో ఉన్నారు. కారు నేరుగా ముఖ్య నేత ఇంట్లోకి వెళ్తుంది. ఈ మధ్య ఆ ముఖ్య నేత తిరుపతి వెళ్తే కూడా నీడగా ఉన్నాడు..వెంటే ఉన్నాడు. ఒక్కొక్క బ్రూవరీకి ఒక్క కోటి 80 లక్షల ధర నిర్ణయించారు. ఒక్కటిన్నర ముఖ్య నేతకు, మిగతా రూ.30 లక్షలు తోడు నీడకు.. 21 తోడు నీడ ఫైనల్ చేసుకున్నారు. 4 మంత్రి ఫైనల్ చేసుకున్నారన్నారు.
110 అప్లికేషన్లు వచ్చాయి అంటున్నారు కదా వైన్స్ లకు లాటరీ తీసినట్టు ఎందుకు లాటరీ తీయడం లేదని ప్రభుత్వాన్ని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడు లేనివిధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు రూ.4500కోట్లు బకాయిలు పడ్డారు. కొన్ని బకాయిలు 16 నెలలకు పైబడి బకాయిలు ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ కూడా ఈ విధంగా లేదు.బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 15రోజుల్లో చెల్లింపులు చేసేవాళ్ళం.దీని వలన బ్రీజర్ సరఫరా ఆగిపోయింది. రాష్ట్రంలో చాలా షాప్‌లలో సరుకు లేదు.ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. లేఖలు కూడా రాశారు. వాటాలు పంపకాల్లో తేడాతోనే బకాయిలు నిలిచిపోయాయి.
రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నది. దీనితో ప్రభుత్వం ఆదాయం పడిపోతోందన్నారు హరీశ్ రావు . ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్ల విషయంలో ముఖ్య నేత అల్లుడుకి, మంత్రి కొడుక్కి కావాలని పట్టుపట్టడంతోఈ ప్రభుత్వం బీర్ కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.మీకు ీర్ల కంపెనీలు ముఖ్యమా…? రైతులు ముఖ్యమా..? అంటే బీరు కంపెనీ లు ముఖ్యం అంటున్నారన్నారు.
సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద రైతులకు క్రాఫ్ హాలిడే..
మెదక్ జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద రైతులకు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు కింద 40వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న బీరు కంపెనీలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నీటి సరఫరా జరుగుతోందని..ఇది మద్యం తయార్ దారు ప్రభుత్వమా…రైతు ప్రభుత్వమా..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. అబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రైతులకు నీరు సప్లై ఆపేయండి. బీరు కంపెనీలకు నీటి కొరత రాకుండా చూడండని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.
Mini Medaram | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మినీ మేడారం జాతర ప్రారంభం
Guava Vs Avocado | జామకాయలు.. అవకాడో.. మన ఆరోగ్యానికి అసలు ఏవి మేలు చేస్తాయి..?