Cyberabad | హైదరాబాద్ : ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ నుంచి యశోద హాస్పిటల్ వరకు కొత్తగా సర్వీసు రోడ్డు నిర్మిస్తుండడంతో.. 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ నుంచి జేఎన్టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. టాడీ కంపౌండ్ నుంచి జేఎన్టీయూ, మూసాపేట్ వెళ్లే వాహనదారులు 100 ఫీట్ జంక్షన్ మీదుగా ఖైతలాపూర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఐకియా, సైబర్ గేట్ వే, సీవోడీ జంక్షన్ నుంచి జేఎన్టీయూ వైపు వెళ్లే వాహనాలు సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ మీదుగా నేరుగా జేఎన్టీయూ వెళ్లొచ్చు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఆంధ్రోళ్ల మీద రేవంత్ రెడ్డిది కపట ప్రేమ : హరీశ్‌రావు
Vande Bharat trains | తెలుగు ప్రజలకు వినాయక చవితి కానుక.. కొత్తగా రెండు వందేభారత్ రైళ్లు
Crocodile | జూరాల డ్యాం రోడ్డుపై మొసలి.. భయంతో పరుగులు తీసిన జనం