అమరచింత, సెప్టెంబర్ 13 : వనపర్తి జిల్లా(Wanaparthi Dist) అమరచింత మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రోడ్డుపై(Jurala Dam Road) శుక్రవారం ఉదయం మొసలి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, భయ బ్రాంతులకు గురైన బాటసారులు, చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మొసలిని (Crocodile) తాళ్లతో బంధించి ప్రాజెక్టులో వదిలిపెట్టారు. ఇదిలా ఉండగా, జిల్లాలో ఎక్కడ మొసలి సంచరించినా జూరాలలో వదలిపెడుతుండడంతో ప్రాజెక్టులో వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతోపాటు నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో మొసళ్లు బయట సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ విసిరే రాళ్లు.. రేపటి మా ప్రభుత్వానికి పునాది రాళ్లు : హరీశ్‌రావు
Harish Rao | రాహుల్ గాంధీ లెక్చర్లు ఆపి.. రాజ్యాంగ ఉల్లంఘనలపై మాట్లాడండి : హరీశ్‌రావు