Padi Kaushik Reddy : అరికపూడి గాంధీతో వివాదం విషయంలో కలుగజేసుకుని నా సంగతి చూస్తానని హెచ్చరించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన సీఎం రేవంత్‌పై విమర్శలు చేశారు. ఇకపై రేవంత్ రెడ్డితో మాట్లాడటానికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అక్కర్లేదని, తాను చాలని అన్నారు.
‘రేవంత్‌రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఇప్పటికైనా మీ స్థాయిని గుర్తించిండ్రు. మీరు మీ స్థాయిని నా స్థాయికి దిగజార్చుకుండ్రు. ప్రభుత్వంలోని నేతలందరూ నాస్థాయికి దిగొచ్చిండ్రు. ఇయ్యాల్టి నుంచి మీకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అవసరం లేదు. ఇక నుంచి కౌశిక్ రెడ్డి వర్సెస్ రేవంత్‌రెడ్డి. ఈ విషయంలో రెస్పాండ్ అయినవ్ గదా..? నా సంగతేందో చూస్తా అన్నవ్ గదా..? ఏం జూస్తవ్ నా సంగతి..? నిన్న నన్ను హత్య చేయంచే ప్రయత్నం చేసినవ్. అధికారం ఉంది కాబట్టి మళ్లా హత్య చేయిస్తవేమో..! నేను తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నా. కానీ నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేను బాబూ రేవంత్‌రెడ్డీ.’ అని వ్యాఖ్యానించారు.
‘తెలంగాణ ప్రజల కోసం, మళ్లా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఈ తెలంగాణ గడ్డమీద ఎగరేయడం కోసం, కేసీఆర్ గారిని మళ్లీ సీఎం పీఠం కూర్చోబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను పోరాడుతనే ఉంటా. మీ అవాకులకు, చెవాకులకు నేను ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నా. ఇయ్యాల హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రతి ఒక్కరు గమనించిండ్రు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏ ఒక్కనాడన్నా ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిండ్రా..? ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా’ అన్నారు.