Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో ఉంటున్న ఆంధ్రోళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి కపట ప్రేమ వలకబోస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులొత్తావు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కలిసి రాలేదు. మేం పోరాడి తెలంగాణ సాధించామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కోకాపేట్‌లోని తన నివాసంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రా నాయకులు, ప్రజల మీద రేవంత్ రెడ్డి ఏదో ప్రేమ వలకబోస్తున్నాడు. అది కపట ప్రేమ. ఎందుకు అంటున్నాంటే.. చిన్నజీయర్ స్వామిని పట్టుకుని ఆంధ్రోడు అని మాట్లాడిన నీచుడు రేవంత్. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయిని కూడా ఆంధ్రోడు అన్నాడు రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ హైదరాబాద్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకున్నాడు. కేసీఆర్ ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయారని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
పీఏసీ చైర్మన్ నియామకం విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. పీఏసీకి ఎన్నిక జరిగిందని నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. అయితే ఆయన ఇది నిన్న ఢిల్లీలో చిట్‌చాట్‌లో చెప్పారు. రేవంత్ రెడ్డితో ఓ సమస్య ఉంది.. చిట్‌చాట్‌లో చెప్పి నేనేప్పుడు అన్న అంటడు. ఎందుకంటే చిట్‌చాట్‌కు వీడియో ఉండదు కదా..? దానికి ప్రూఫ్ ఉండదు. గతంలో ఢిల్లీలో చిట్‌చాట్ చేసి అదానీకి ఓల్డ్ సిటీ అప్పజెప్పిన అన్నడు.. ఈ విషయంపై మేం అసెంబ్లీలో నిలదీస్తే.. పేపర్ వాళ్లు తప్పు రాశారు అని బుకాయించారు. ఇది కూడా నిన్న ఢిల్లీలో చిట్‌చాట్‌లో జరిగిందన్నాడు. పీఏసీ నియామకం ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఒక వేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే తిరస్కరించాలంటే అసెంబ్లీలో ఎన్నిక జరగాలి. బులెటిన్ ఇచ్చి ఎన్నిక జరిగింది అంటున్నాడు. నోరు విప్పితే అబద్దాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగం ప్రకారం ఎన్నిక పెట్టాలి కానీ, ఎన్నిక జరగలేదు. ఏ రోటికాడ ఆ మాట మాట్లాడుతున్నడు రేవంత్ రెడ్డి. రేవంత్ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ విసిరే రాళ్లు.. రేపటి మా ప్రభుత్వానికి పునాది రాళ్లు : హరీశ్‌రావు
Harish Rao | రాహుల్ గాంధీ లెక్చర్లు ఆపి.. రాజ్యాంగ ఉల్లంఘనలపై మాట్లాడండి : హరీశ్‌రావు