KTR | ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు వత్తాసు పలకడమేనా ప్రజా పాలనా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. టెస్కోకు విద్యాశాఖ షాక్ అని ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఎక్స్‌లో కేటీఆర్ ట్యాగ్ చేస్తూ రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతుందని.. ఇది ప్రజా ప్రభుత్వమా.. లేక ‘ప్రైవేట్’ లిమిటెడ్ కంపెనీయా..? అని మండిపడ్డారు.
రూ. 105 కోట్ల విలువ గల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక మతలబు ఏంటి..? అని ప్రశ్నించారు. సంక్షేమ శాఖ నుండి టెస్కోకు దక్కాల్సిన రూ. 200 కోట్ల దుస్తులు, దుప్పట్ల ఆర్డర్ ఇంకా ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంటి..? అని అడిగారు.
కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా కమీషన్లు దండుకోవాలనే యావలో ప్రైవేట్ వ్యక్తులకు ఆర్డర్లు ఇస్తున్నదని ధ్వజమెత్తారు. నేతన్నల ఉసురు పోసుకుంటున్న కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
ఇది ప్రజా ప్రభుత్వమా… లేక ‘ప్రైవేట్’ లిమిటెడ్ కంపెనీయా?
ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ
ప్రైవేటు సంస్థలకు వత్తాసు పలకడమేనా ప్రజా పాలన?రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి
ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి
చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతుంది రేవంత్ సర్కార్.… pic.twitter.com/qX5E4Hgf2D— KTR (@KTRBRS) April 2, 2026
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత