KTR | అట్టర్ ప్లాప్ సినిమాకి అర్ధశత దినోత్సవం చేయడమంటే ఇదే.. రైతు ఆశీర్వాద సభలపై కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డి ఒక ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడని అన్నారు. కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు. ఇప్పుడు మోదీ ఎంత పంట కొనమని చెప్తే అంతే కొంటా అని బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014-15లో 26.13 లక్షల హెక్టార్లలో సాగు జరిగేదని.. 2023-24కు 59.89 లక్షల హెక్టార్లకు సాగు పెరిగింది.. అంటే కోటి ఎకరాల మాగాణి పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన ఆ రోజుల్లో 24.29 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయితే, కేసీఆర్ దిగిపోయే నాటికి డబుల్ అయింది. ఇవన్నీ ప్రభుత్వ అధికారిక మార్క్ ఫెడ్ వెబ్సైట్లోనే ఉన్నాయన్నారు.
రేవంత్ రెడ్డి లుచ్చా మాటలు మాట్లాడకుండా, తెలంగాణలోనే ఉండి పరిపాలన చేయొచ్చు కదా.. రేవంత్ రెడ్డి చేసిన దివాళాకోరు రాజకీయం, వెదవ పనులకు, ఓటుకు నోటు దొంగ అయినందుకు ఢిల్లీలో ఆయనను అసహ్యంగానే చూస్తారన్నారు. రేవంత్ రెడ్డి కేవలం రైతులకే రూ.1,13,000 కోట్లు బాకీ పడ్డాడు.. రైతులను నిండా ముంచి, ఇప్పుడు రైతు ఆశీర్వాద సభలు పెడుతున్నారు. అట్టర్ ప్లాప్ సినిమాకి అర్ధశత దినోత్సవం చేయడం అంటే ఇదేనని మండిపడ్డారు.
దమ్ముంటే బాకీ తీర్చిన తరువాత ఉత్సవాలు చేయండి..
రైతుబంధు–రూ.30,000 కోట్లు, కౌలు రైతులకు–రూ.22,500 కోట్లు, రుణమాఫీ–రూ.29,500 కోట్లు, రైతు కూలీలు–రూ.15,000 కోట్లు బోనస్ –రూ.16,000 కోట్లు, మొత్తం కలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతులకే రూ.1,13,000 కోట్లు బాకీ పడింది, దమ్ముంటే ఈ బాకీ తీర్చిన తరువాత రైతు ఉత్సవాలు నిర్వహించండని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఒక ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడని అన్నారు. కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు. ఇప్పుడు మోదీ ఎంత పంట కొనమని చెప్తే అంతే కొంటా అని బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది.. మేము చేసిన అప్పు రూ.2.78 లక్షల కోట్లు అని.. కానీ నువ్వేమో రూ. 7 లక్షల కోట్లు అంటావు, ఇంకోడు రూ.8 లక్షల కోట్లు అంటాడు.. మొహం బాగాలేక అద్దం పగలకొట్టినట్లు.. నీకు పరిపాలన చేతగాక గత ప్రభుత్వం మీద ఇంకా ఎన్నిరోజులు ఏడుస్తావని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి కేవలం రైతులకే రూ.1,13,000 కోట్లు బాకీ పడ్డాడు
రైతులను నిండా ముంచి, ఇప్పుడు రైతు ఆశీర్వాద సభలు పెడుతున్నారు
అట్టర్ ప్లాప్ సినిమాకి అర్ధశత దినోత్సవం చేయడం అంటే ఇదే
రైతుబంధు–రూ.30,000 కోట్లు
కౌలు రైతులకు–రూ.22,500 కోట్లు
రుణమాఫీ–రూ.29,500 కోట్లు
రైతు… pic.twitter.com/fE3RqYD4qM— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014-15లో 26.13 లక్షల హెక్టార్లలో సాగు జరిగేది
2023-24కు 59.89 లక్షల హెక్టార్లకు సాగు పెరిగింది.. అంటే కోటి ఎకరాల మాగాణి పెరిగింది
కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన ఆ రోజుల్లో 24.29 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయితే, కేసీఆర్ దిగిపోయే నాటికి డబుల్… pic.twitter.com/qdWyOir00u
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026
Read Also :
SS Rajamouli | ఇంకా 80 రోజుల షూటింగే బాకీ.. ‘వారణాసి’పై రాజమౌళి అప్డేట్!
‘వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి’
YS Jagan | ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన..కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

