Talasani Srinivas Yadav | సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నల్లగుట్టలో మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. 10 సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలును మరిచిందన్నారు. హామీల అమలు గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారు. తాను రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి భాషను చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్.. శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
Thalapathy Vijay | ‘ఇదే నా చివరి సినిమా’.. సినిమాలకు గుడ్ బై చెప్పిన దళపతి విజయ్
Rajendran | గుండు వెనుక విషాద కథ.. అదే రాజేంద్రన్‌కు వరంగా మారిందట!