Harish Rao | హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) గేట్ మీటింగ్కు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న మీటింగ్ పెట్టిర్రు. ప్రజా పాలన ప్రజాపాలన అని ఊదరగొట్టి పోయిర్రు. అది నిజంగా ప్రజాపాలననా.. ప్రజా వంచక పాలన.. ప్రజలను వంచించిన పాలన కాంగ్రెస్ పాలన అని ధ్వజమెత్తారు.
ప్రజలకు, మా ఉద్యోగులకు, మా కార్మికులకు ఇచ్చిన హామీ కాంగ్రెస్ పాలనలో ఒక్కటైనా అమలైందా.. అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు అయింది.. అప్పుడు ఏం చెప్పిర్రు. మేం రాగానే వెంటనే పీఆర్సీ ఇస్తమన్నారు. వెంటనే పెండింగ్ డీఏలు ఇస్తం.. వచ్చినయా..? రెండున్నరేండ్లు అయినా పీఆర్సీకి ఉలుకూ పలుకూ లేదు. వస్తదా.. రాదా కూడా చెప్తలేరు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవవరణ దినోత్సవం. ముఖ్యమంత్రి ఏమన్నా చెప్తడేమోనని.. పీఆర్సీ వస్తదేమో.. మా జీతాలేమన్నా పెరుగతయేమో..? అని ఆశగా ఎదురుచూసిర్రు.
పెట్రోల్, డీజిల్, కూరగాయలు ధరలు పెరిగినయ్.. జీతమేమో పెరుగుతలేదు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతడేమో అని ఆశగా చూసిర్రు. కానీ నిరాశే మిగిలింది. పుస్తకం కూడా మొత్తం చదవలేదు.. ఎండకొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకోండి అన్నడు. అయితే పీఆర్సీ గురించి ఉలుకూ లేదు.. పలుకూ లేదు. పోనీ పీఆర్సీ ఇచ్చిండా..? ఆరు డీఏలు.. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఆరు డీఏలు పెండింగ్లో పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే.. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రస్ గవర్నమెంట్.. రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు. డీఏలు ఇయ్యడు. పీఆర్సీలు ఇయ్యాడు.. ఉద్యోగుల ఉసురు పోసుకున్నడని మండిపడ్డారు.
ఆర్టీసీ వాళ్లకు చెప్పిన మాట నిలబెట్టుకున్నవా..?
ఆశా వర్కర్లకు అధికారంలోకి రాగానే రూ.18 వేలు చేస్తా అన్నడు.. వచ్చిందా..? పాపం వాళ్లు రోజు కోఠి దగ్గర ధర్నాలు చేస్తున్నరు. నిజంగా ఇది ప్రజా ప్రభుత్వమైతే రెండున్నరేండ్లయింది కదా.. మేనిఫెస్టోలో పెట్టినవ్.. ఎన్నికల ముందు.. మరి ఆశా వర్కర్లకు రూ.18 వేల చేసినవా అని హరీశ్ రావు అడిగారు. అంగన్ వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నవా..? ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులను చేస్తా అని.. పీఆర్సీ ఇస్తా అని ఆర్టీసీ వాళ్లకు చెప్పిన మాట నిలబెట్టుకున్నవా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కార్మికులకు వేతనాలుపెంచుతా అని వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవా..?
సింగరేణిలో అందరికీ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చినవ్. ఉద్యోగాలు ఇస్తలేడు..కానీ ఇచ్చినోళ్లను తీసేస్తా అంటుండు. సింగరేణి కార్మికులకు మోసం.. ఆశా అంగన్ వాడీ కార్మికులకు మోసం, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ కార్మికులకు మోసం, మా హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులకు మోసం.. మోసమే కాంగ్రెస్ నైజం. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. గతంలో మేం 650మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. ప్రశ్నించే గొంతును గెలిపిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని.. మూడు కార్పోరేషన్లు చేసినా హెచ్ఎండబ్ల్యూఎస్ మాత్రం అలాగే ఉందని, హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులను ఎందుకు పెంచరని అన్నారు. కార్మికుడిపై భారం తగ్గాలన్నదే బీఆర్ఎస్ ఆలోచన అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Live: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) గేట్ మీటింగ్ https://t.co/sc0OLnzo31
— BRS Party (@BRSparty) June 4, 2026
Ameerpet Fire Accident | అమీర్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్లో ఎగసిపడుతున్న మంటలు
Chiranjeevi | ‘పెద్ది’ విజయంపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. చరణ్ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది..
‘వార్డు సభల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’