మారేడ్‌పల్లి, ఆగస్టు 22 : రైల్లోంచి(Train) ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి(Person Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్కేసర్-బీబీనగర్ రైల్వే స్టేషన్ల మధ్యన ఖాజమోహినుద్దీన్ (35) సికింద్రాబాద్ నుంచి భువనగిరి వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైల్లోంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి భార్య, 7 సంవత్సరాలు కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Demonte Colony 3 | డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుంది.. అప్పుడే విడుదల టైం కూడా ఫిక్స్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని