Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బ్లాక్ ఫిలిమ్ అద్దాలతో తిరిగే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజుల వ్యవధిలో 1007 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు.
వాహనాలకు బ్లాక్ ఫిలిమ్లు వేసుకొని తిరగడంపై నిషేధం ఉందన్నారు. వాహనాల ముందు విండోకు 70 శాతం వెలుతురు వచ్చే విధంగా, వెనుక విండోకు 50 శాతానికి తక్కువ కాకుండా వెలుతురు వచ్చే విధంగా తయారు చేయాలని నిబంధనలున్నాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బ్లాక్ ఫిలిమ్‌ను తొలగించడంతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తున్నట్లు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
MLA Prakash Goud | కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
CM Revanth | బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’ ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ సూచన
Bandi Sanjay | ఓయూలో తిరిగి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ముందా? రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాలు
Samvidhaan Hatya Diwas | ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్