శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - May 20, 2020 , 16:58:31

నిలబడి నీరు తాగితే ఇక అంతే..

నిలబడి నీరు తాగితే ఇక అంతే..

పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీరు తాగడం మంచిది అంటారు పెద్దలు. ఈ పద్ధతిని ఫాలో అయిపోతే జీర్ణవ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది. దీంతో ఆరోగ్యం పాడవ్వడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం.

సమస్యలు.. 

- నీరు తాగడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటుంది. దీంతో చర్మం ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా కనబడడానికి దోహదపడుతుంది. 

- అసలే ఎండలు. బయటకె వస్తే దప్పికతో అలమటిస్తున్నారు. జనవరి నెల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక మే నెలకు వచ్చేసరికి పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే మార్గం. అది నీరు తాగడమే.

- దాహమేసినప్పుడు నీరు కనిపించగానే ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్లి తాగకూడదు. వీలైనంత జాగ్రత్తగా కూర్చొనే తాగాలి. అలా అయితేనే కడుపు నిండుతుంది. 

- దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియకు ఎలాంటి భంగం కలుగదు. నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదు. దీనివల్ల మూత్రాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్‌ సమస్యలకు దారితీస్తాయి. 

- నీలబడి నీరు తాగడం వల్ల నీళ్లు మూత్రపిండాల ద్వారా సరిగా వడకట్టడానికి వీలుపడదు. తద్వారా వ్యర్థపదార్థాలు నేరుగా మూత్రపిండాల్లోకి వెళ్లి రక్తంతో కలిసి, మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. ద్రవాల సమతుల్యత దెబ్బతిని కీళ్లల్లో ఎక్కువ ద్రవాలు చేరి ఆర్థరైటీస్‌ కీళ్లవాతం వంటి సమస్యలకు దారితీస్తాయి.


logo