దాంపత్య జీవితంపై ఆసక్తి తగ్గుతున్నది.. ఎందుకు?
మేడం! నాకు 40 ఏండ్లు. దాంపత్య జీవితంపై ఆసక్తి క్రమంగా తగ్గుతున్నది. అలాగని, నాకు ఎలాంటి అనారోగ్యమూ లేదు. ఎందుకంటారు? – రవిప్రకాష్
మారిన జీవన విధానంలో వైవాహిక జీవితం పాతబడేకొద్దీ, శృంగార కాంక్ష తగ్గిపోతున్నది. 19-29 సంవత్సరాలవారు నెలలో 10-15 సార్లు సెక్స్‌లో పాల్గొంటే.. 30-40 ఏండ్లవారు 8-12 సార్లు, 40-50 ఏండ్ల వారు 4-8 సార్లు సెక్స్ చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ హార్మోన్ శాతం పడిపోవడం కూడా కోరిక తగ్గడానికి ఓ కారణం.

మరిన్ని కారణాలు : డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలవల్ల కూడా సెక్స్‌లో పాల్గొనే నిష్పత్తి తగ్గిపోతుంది. హిస్టెరెక్టమీ, ప్రసవాలు, ఎపిసియోటమీ, సిజేరియన్, బైపాస్ సర్జరీ లాంటి ఆపరేషన్ల తర్వాత శారీరక, మానసిక స్థితిగతుల వల్ల సెక్స్ పట్ల సుముఖత ఉండదు. శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చి.. చదువు, ఉద్యోగం, కెరీర్ పాడవుతాయేమోననే భయం మరో కారణం. కాన్పు తర్వాత పిల్లల పెంపకం, పోషణ, నిద్రలేని రాత్రులు తల్లికి అలసటను కలగజేస్తాయి. ఐటీ దంపతులు షిఫ్ట్ డ్యూటీల వల్ల తరచూ కలుసుకోలేరు. రాత్రిళ్ళు డ్యూటీ చేసి, తెల్లారి నిద్రపోక తప్పని పరిస్థితి. దంపతుల మధ్య వైరుధ్యాలు, అహాలు, ఆర్థిక సమస్యలు, అక్రమ సంబంధాలు కూడా లైంగిక జీవితంలో వైఫల్యానికి కారణాలే. ఇంట్లో అత్త, ఆడబిడ్డల గృహహింస, భర్త ఆధిపత్య ధోరణి, డిప్రెషన్.. ఇలా సమస్య ఎటు నుంచి ఉన్నా, సెక్స్‌పై నిరాసక్తత ఆవహిస్తుంది. కొందరు రాత్రి షిఫ్టుల వల్ల పని స్థలాల్లోనే అశ్లీల సైట్స్ చూస్తూ.. స్వయంతృప్తిని పొందుతుంటారు. దీంతో, ఇంట్లోని జీవిత భాగస్వామి పట్ల నిర్లిప్తంగా ఉంటారు.
చికిత్స – పరిష్కారం : ముందు ఆ దంపతులు శృంగార వైఫల్యాలను అధిగమించడానికి మంచి సెక్సాలజిస్టును సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. అలాగే తమ మధ్య ఉన్న గొడవలను పరిష్కరించుకోవటానికి మ్యారిటల్ థెరపిస్టును కలువాలి. డయాబెటిస్ లాంటి వ్యాధులుంటే, వైద్యం ద్వారా తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. యోగా, నడక, మంచి పౌష్టికాహారాలతో జీవన సరళిని మార్చుకోవాలి. డయాబెటిస్, బీపీ లాంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా అంగస్తంభన లోపం వస్తుంది. కాబట్టి డోసేజీ, మందుల విషయంలో డాక్టర్‌ను సంప్రదించాలి. షిఫ్టు డ్యూటీలు చేసే దంపతులు.. ఇద్దరికీ ఒకేరోజు సెలవు, తీరిక వచ్చేలా జాగ్రత్తపడాలి. వారంలో రెండు లేదా మూడు రోజులు కచ్చితంగా శృంగారపు దినాలను పాటించాలి. అలాగే వైవాహిక జీవితకాలం ఎక్కువగా ఉన్న దంపతులు శృంగారంలో నూతన పద్ధతులను ఎంచుకోవాలి. దీనివల్ల లైంగిక జీవితం పాతబడకుండా ఉంటుంది.
డా. భారతి (ఎమ్మెస్)
Sexologist & psychotherapist
మారిటల్ కౌన్సిలర్, జయా హాస్పిటల్
బీ.ఎన్ రెడ్డి నగర్ ,హైదరాబాద్
bharathid506@gmail.com, 9908383910
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బైపాస్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
బయటకు వచ్చేస్తున్నది..ఏం చేయమంటారు?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

