Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Dhanush Party | నటుడు ధనుష్ (Actor Dhanush) రాజకీయరంగ ప్రవేశంపై తమిళనాడు (Tamil Nadu) లో గత కొంతకాలంగా చర్చ నడుస్తున్నది. ఆయన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం (Dhanush Narpani Iyakkam)’ గా మార్చడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమని అంతా అంటున్నారు.
Dhanush Party : నటుడు ధనుష్ (Actor Dhanush) రాజకీయరంగ ప్రవేశంపై తమిళనాడు (Tamil Nadu) లో గత కొంతకాలంగా చర్చ నడుస్తున్నది. ఆయన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం (Dhanush Narpani Iyakkam)’ గా మార్చడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమని అంతా అంటున్నారు. ఈ పరిణామంపై తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) స్పందించింది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని తెలిపింది.
టీవీకే అధికార ప్రతినిధి ఎం సత్యకుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ.. తమ పార్టీ ప్రయాణం ఇతరులు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు. హీరోగా ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే విజయ్ సినిమాలను వదిలి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని గుర్తుచేశారు. విజయ్ ఇందుకోసం 30 ఏళ్లపాటు కృషి చేశారని, ఇది అంత సులభమైన ప్రయాణం కాదని సత్యకుమార్ అన్నారు. రాజకీయ పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే.. దానిని నిలబెట్టడం, ఎన్నికల్లో విజయం సాధించడం మరో ఎత్తు అని చెప్పారు.
రాజకీయాల్లోకి రావాలనుకునేవారు పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందన్నారు. కాగా, ధనుష్ ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఎన్నికల సంఘంలో నమోదు చేశారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ధనుష్ కొన్ని రోజులుగా వరుస మీటింగ్లు నిర్వహిస్తుండడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు మొదలయ్యాయి. కొన్ని నెలలుగా తన అభిమాన సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో ధనుష్ సామాజిక కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

