Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Ravana Dahan | దసరా నాడు రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీ. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజ్నాథ్ పట్టణం మాత్రం రావణ దహనం నిర్వహించరు
Ravana Dahan | దేశవ్యాప్తంగా దసరా పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం అనేక ప్రాంతాల్లో ఆనవాయితీ. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజ్నాథ్ పట్టణం మాత్రం రావణ దహనం నిర్వహించరు. దీనికి కారణం అక్కడి పురాతన శివాలయం, రావణుడికి సంబంధించిన స్థానిక విశ్వాసాలే.
రావణుడి శివభక్తితో ముడిపడిన కథ
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కాంగ్రా (Kangra) జిల్లా అధికారిక వెబ్సైట్లో ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర, స్థల పురాణం వివరించారు. దాని ప్రకారం.. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రావణుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేశాడని చెబుతారు. పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలనే సంకల్పతో రావణుడు తన తలలను ఒక్కొక్కటిగా సమర్పించేందుకు సిద్ధపడ్డాడు. దీంతో అతని అచంచల భక్తికి మెచ్చిన శివుడు ప్రతక్షమైన వరాలను ప్రసాదించాడు.. అప్పుడు శివుడిపై ఉన్న భక్తితో ఆయన్ను తన రాజ్యమైన లంకకు తీసుకెళ్లాలని రావణుడు కోరుకున్నాడు.. రావణుడి ఆ కోరిక మేరకు శివుడు లింగరూపంలో అతనితో వెళ్లేందుకు అంగీకరించాడు. అయితే ఆ ప్రయాణంలో శివలింగాన్ని ఎక్కడా నేలపై ఉంచకూడదని పరమేశ్వరుడు షరతు విధించాడు.
అలా బయల్దేరిన సమయంలో మార్గమధ్యలో రావణుడికి తీవ్ర లఘుశంక(మూత్రవిసర్జన) కలగడంతో ఆ లింగాన్ని పట్టుకోమని గొర్రెల కాపరి రూపంలో అక్కడకు వచ్చిన వినాయకుడికి ఇచ్చాడు. కానీ రావణుడు వెళ్లిన కొద్దిసేపటికే ఆ లింగం విపరీతమైన బరువుగా మారిపోయిందని నటిస్తూ వినాయకుడు బైజనాథ్లోని నేలపైనే ఉంచేశాడు. రావణుడు తిరిగి వచ్చి చూసేసరికి ఆ లింగం అక్కడే భూమిలో స్థిరపడిపోయింది. రావణుడు తన సర్వశక్తులు ఉపయోగించి దానిని పైకి లేపడానికి ప్రయత్నించినా అది కదల్లేదు. తాను మోసపోయానని గ్రహించిన రావణుడు తీవ్ర నిరాశతో, పశ్చాత్తాపంతో లంకకు తిరిగి వెళ్లిపోయాడు. రావణుడు ఆత్మలింగాన్ని ఉంచిన ఆ పవిత్ర స్థలంలోనే ఈనాటి బైజనాథ్ మహాదేవ్ ఆలయం నిర్మితమైంది. ఈ పౌరాణిక నేపథ్యం కారణంగా బైజనాథ్ పట్టణంలో రావణుడిని శివభక్తుడిగా గౌరవిస్తారు. అందుకే ఇక్కడ దసరా పండుగ రోజున రావణ దహనం చేయరు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

