Avocado Oil Health Benefits | ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె ఆరోగ్యపరంగా మంచివని అంటారు. బరువును తగ్గించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయనే పేరుంది. వాటికంటే కూడా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందించేది.. ‘అవకాడో ఆయిల్’. దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కారణం అవుతాయి.
అవకాడో నూనెలో ల్యూటిన్, విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తాయి. మామూలుగా కోడిగుడ్ల నుంచి ల్యూటిన్, విటమిన్-ఇ అందుతాయి. వాటికి బదులుగా అవకాడో నూనె తీసుకుంటే మరింత ప్రయోజనం పొందవచ్చు. మనం ఎక్కువగా ఉపయోగించే కొబ్బరినూనె, వెన్న, నెయ్యికి బదులుగా అవకాడో వాడితే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రయోజనాలు లభిస్తాయి.
అవకాడోలో సంతృప్త కొవ్వులు అధికం. అవి మన శరీరంలోని కణజాలాన్ని ఉత్తేజ పరుస్తాయి. అవకాడో నూనె కొద్దిగా మట్టి, కొద్దిగా గడ్డి వాసన కలిగి ఉంటుంది. ఈ ఫ్లేవర్‌ను ఇష్టపడనివారు రిఫైన్డ్ అవకాడో నూనె తీసుకోవచ్చు. సలాడ్, బ్రెడ్ వంటివాటిపై రిఫైన్డ్ అవకాడో నూనెను చిలకరించుకొని తింటే.. ఆ రుచి అద్భుతం. మటన్ రోగన్, ఫిష్ కర్రీ, అండా బుర్జీ వంటివి కూడా అవకాడో నూనెతో వండితే రుచిగా ఉంటాయి. పోషకాలనూ అందిస్తాయి.
“సూప్‌లు టేస్ట్ కోసమేనా? వెజ్ సూప్, చికెన్ సూప్‌లు తాగితే లాభమేంటి?”