సూప్‌లు టేస్ట్ కోసమేనా? వెజ్ సూప్, చికెన్ సూప్‌లు తాగితే లాభమేంటి?
Soup Health Benefits | శ్రీవల్లి, కార్తికేయ రెస్టారెంట్‌కు వెళ్లారు. మెనూకార్డులో చవులూరించే రకరకాల పదార్థాలు ఎన్ని ఉన్నా.. రుచికరమైన సూప్ కోసం వెదుకుతున్నారు. ఆకలి పెంచి ఆబగా తినేందుకు కాదు వాళ్లు ముందుగా సూప్ తాగాలనుకున్నది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూప్‌ను ఆస్వాదించాకే, మరేదైనా అనుకున్నారు. అవును! సూప్‌లలో రుచిని పంచేవే కావు, ఆరోగ్యాన్ని పెంచేవీ ఉంటాయి. అవేంటో ఓ లుక్కేయండి.

వెజ్ సూప్: కూరగాయలు ఉడకబెట్టి చేసే వెజ్సూప్లో కావాల్సినంత ఫైబర్, బోలెడన్ని ప్రొటీన్లు ఉంటాయి. బీన్స్, చిక్కుడు, ఇతర కాయగూరలతో చేసిన సూప్‌ను తరచూ రుచి చూడటం మంచిది. వీటిలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
చికెన్ సూప్: బరువు తగ్గించే సూప్ ఇది. ఇందులో అధికంగా ఉండే ప్రొటీన్లు ఆకలిని మందగింపజేస్తాయి. చికెన్ సూప్‌లోని సిస్టీన్ అమైనో ఆమ్లాలు డీహైడ్రేషన్‌ను తగ్గిస్తాయి. గొంతుమంట నివారణకు చక్కటి ఔషధం ఇది.
రైస్ సూప్: వెనుకటి రోజుల్లో రైతులు గంజి తాగి పొలానికి వెళ్తుండేవారు. చెమటోడ్చి పనిచేసే వాళ్లు. గతిలేక గంజి తాగినా, అదే వాళ్ల ఆరోగ్య రహస్యం కూడా! ఇప్పుడు ఆరోగ్యంగా బతకడానికి ఆగర్భ శ్రీమంతులూ గంజి తాగుతున్నారు. రైస్ సూప్‌లో శక్తిని పెంచే కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి నేరుగా అన్నం తినడం కన్నా, సూప్ తాగడం మంచిది. దీనివల్ల బరువూ తగ్గొచ్చు.
గుమ్మడికాయ సూప్: ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. గుమ్మడిలో ఉండే పొటాషియం, విటమిన్-సి గుండెకు మేలు చేస్తాయి. తరచూ గుమ్మడికాయ సూప్ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
Read More :
“Lemongrass | లెమన్‌గ్రాస్‌తో చేసిన టీ తాగితే లాభమేంటి?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

