Black pepper | మిరియాలతో బరువు ఎలా తగ్గవచ్చంటే..?
Black pepper | నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా వీటితో శరీరం అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను వంట ఇంటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు. వీటితో వంటలకు చక్కని రుచి వస్తుంది. ఘాటును కోరుకునే వారు కారంకు బదులుగా మిరియాలను వాడవచ్చు. వీటిలో సోడియం, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో రోగాలను నయం చేయడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వీటితో శరీరం అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెరగకుండా చేయడంలో నల్ల మిరియాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. నిత్యం వీటిని తీసుకోవడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
- నల్ల మిరియాల టీ తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. ఇవి కేలరీలను కరిగిస్తాయి. దీనిలో ఉండే ఫైబర్ వల్ల ఆకలి తొందరగా కాదు. ఫలితంగా శరీరం బరువు పెరుగకుండా చూసుకోవచ్చు.
- కీళ్ల నొప్పులు తగ్గించడంలో నల్ల మిరియాలు గ్రేట్‌గా పనిచేస్తాయి. వీటిలోని యాంటీ ఆన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహకరిస్తాయి.
- నల్ల మిరియాల్లో ఉండే పెప్పరిన్ అనే సమ్మేళనం.. వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ల నుంచి బయటపడేస్తుంది.
- వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.
ఇలా వాడండి..

- కొన్ని మిరియాలను తీసుకుని వాటిని రెండు తమలపాకుల్లో పెట్టుకుని నిత్యం నమిలి మింగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
- ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారు.
- మార్కెట్లో దొరికే బ్లాక్ పెప్పర్ ఆయిల్‌ను తీసుకుని అందులోంచి ఒక చుక్క ఆయిల్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగినా శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
- అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి వేసి చేసిన గ్రీన్ టీ తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
- అర కప్పు మోతాదులో పుచ్చకాయ, పైనాపిల్ జ్యూస్‌లను తీసుకుని వాటిని కలిపి అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నిత్యం ఉదయాన్నే తాగితే అధిక బరువు త్వరగా తగ్గుతారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

