Lemongrass Benefits | నిమ్మగడ్డితో చేసిన టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. మధుమేహం ఉన్నవాళ్లు ఈ టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి.
భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ కొద్దిమొత్తంలో నిమ్మగడ్డితో చేసిన టీ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. నిమ్మగడ్డిని సన్నగా తురిమి కొత్తిమీర మాదిరిగానే వంటలపై చల్లుకుని తినవచ్చు. నిమ్మగడ్డిని ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు.
జీర్ణ సమస్యలు, నిద్రలేమి, కిడ్నీ సమస్యలు, ఒత్తిడి, తలనొప్పి తదితర సమస్యలకు కూడా లెమన్ గ్రాస్ టీ బాగా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. క్యాన్సర్ కారకాలను
నిర్మూలించడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
దగ్గు, జలుబు, అలర్జీలు, గొంతు సమస్యలు ఉన్నవాళ్లు ఈ టీ తాగితే ఉపశమనం కలుగుతుంది. దీనిలోని యాంటీ మైక్రోబ్యాక్టీరియల్, యాంటీపైరెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల శరీరంలోని వ్యాధి కారకాలు బలహీనపడి రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.
“Pink Salt | హిమాలయాల్లో తయారయ్యే ఈ ఉప్పు ఎంత ప్రత్యేకమో తెలుసా!!”