Cashew Benefits | మనం ఇష్టంగా తినే జీడిపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పోషకాలు ఉంటాయని తెలిసిందే. ఆడవాళ్లలో నెలసరి సమస్యలకు కారణమవుతున్న హార్మోన్ల అసమతౌల్యాన్ని కూడా ఇవి తగ్గిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
జీడిపప్పులో ఉండే అనకార్డిక్ యాసిడ్ అధిక ఈస్రోజెన్ స్థాయుల్ని నియంత్రిస్తుంది. ఈస్ట్రోజెన్ ( estrogen hormone ) అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఒక కీలక హార్మోన్. అయితే ఇటీవల జీవనశైలుల కారణంగా దీని ఉత్పత్తి అధికం అవుతున్నది. ఫలితంగా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, బరువు పెరగడం, గర్భాశయంలో కణుతులు ఏర్పడటం, నెలసరిలో హెచ్చుతగ్గులు, అధిక రక్తస్రావంలాంటి రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. గుప్పెడు జీడిపప్పుల్లో దాదాపు 20 మిల్లీ గ్రాముల అనకార్డిక్ ఆమ్లం ఉంటుంది. తరచూ వీటిని తినడం వల్ల హార్మోన్ల అసమతౌల్యాన్ని తగ్గించుకోవచ్చన్నమాట!
Apple Cider Vinegar | బ్యూటీ ప్రొడొక్ట్స్లో వాడే యాపిల్ సైడర్ వెనిగర్ తినొచ్చా?”