Apple Cider Vinegar | బ్యూటీ ప్రొడొక్ట్స్లో వాడే యాపిల్ సైడర్ వెనిగర్ తినొచ్చా?
Apple Cider Vinegar Benefits | చర్మ, కేశ సౌందర్య చిట్కాల్లో యాపిల్ సైడర్ వెనిగర్ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆహారంలోనూ భాగం చేసుకోవడం ద్వారా రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు. జీర్ణ వ్యవస్థను మెరుగు పరచి, బరువు తగ్గేందుకూ సాయపడుతుంది.
› యాపిల్ జ్యూస్‌కు ఈస్ట్ కలిపి పులియబెట్టిందే యాపిల్ సైడర్ వెనిగర్. జీర్ణాశయ సమస్యల నుంచి ఉపశమనం లభించాలంటే ఒక పెద్ద గ్లాసు నీళ్లలో ఒకటి రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ని కలిపి తాగాలి. పులి తేన్పులు, ఫుడ్ పాయిజనింగ్, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గించేందుకూ సహకరిస్తుంది.
› ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. వ్యాధికారక సూక్ష్మ క్రిములను చంపుతుంది. అందుకే పులిపిర్ల చికిత్సలో వాడుతారు. ఆహార పదార్థాలకు ఈ వెనిగర్ కలిపితే..
బ్యాక్టీరియా అభివృద్ధిని మందగింపజేసి ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేస్తుంది.
› యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుంటే చాలా సేపటి వరకూ పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో తక్కువగా తింటాం. అలా బరువు తగ్గేందుకూ సహకరిస్తుంది.
› టైప్-2 మధుమేహ చికిత్సలో బాగా పనిచేస్తుంది. రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ స్థాయులను నియంత్రణలో ఉంచేందుకు కూడా సాయ
పడుతుంది.
› పొడిబారిన చర్మాన్ని తేజోమంతం చేసేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ తోడ్పడుతుంది. ఎగ్జిమా లాంటి చర్మ సమస్యలను నివారించడంలోనూ ఉపయోగపడుతుంది.
Read More :
“popcorn | పాప్‌కార్న్ తింటున్నారా? ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయో తెలుసుకోండి..!”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- Health
- Health benefits
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

