సినిమా అనగానే గుర్తుకొచ్చేది పాప్‌కార్న్. మనలో అధిక శాతం మంది సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లినప్పుడు మాత్రమే పాప్‌కార్న్ తింటుంటారు. అయితే నిజానికి పాప్‌కార్న్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా తినవచ్చు. పాప్‌కార్న్‌లో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు మనల్ని వివిధ ఆరోగ్య సమస్యల నుంచి బయట పడేస్తాయి. పాప్-కార్న్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బీ కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం ఉన్నాయి. ఇది ప్రాసెస్ చేయని 100 శాతం సహజసిద్ధమైన తృణధాన్యంగా చెప్పవచ్చు. మరి తరచూ పాప్‌కార్న్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!