Pink Salt | హిమాలయాల్లో తయారయ్యే ఈ ఉప్పు ఎంత ప్రత్యేకమో తెలుసా!!
Pink Salt | సముద్రం నుంచి పుట్టే ఉప్పు గురించి అందరికీ తెలుసు. మరి హిమాలయాల్లో తయారయ్యే లవణం గురించి తెలుసా? అవును, హిమాలయాల్లో కూడా ఉప్పు తయారవుతుంది. దీన్నే ‘పింక్ సాల్ట్’ అంటారు.
పింక్ సాల్ట్ చూడటానికి సాధారణ రాళ్ల ఉప్పులానే కనిపిస్తుంది. కాకపోతే, లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇందులో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. హిమాలయ పరిసరాల్లో లభ్యం అవుతుంది కాబట్టి, హిమాలయన్ పింక్ సాల్ట్ అనీ అంటారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం కాస్త తక్కువే. అందుకే సూపులు, సలాడ్లలో భాగం చేసుకుంటారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే.. ఇందులో 98% సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీంతో పాటు పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం.. మొదలైన ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. అందువల్లనే సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ ఎంతో మంచిది.

పింక్ సాల్ట్ శరీరంలోని చెడు పదార్థాలను తొలగించి, నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. సోడియంను అదుపులో ఉంచి, అతిదాహాన్ని నివారిస్తుంది. రక్తపోటు నియంత్రణకు, హార్మోన్ల సమతూకానికి ఉపయోగపడుతుంది. ఈ ఉప్పులో డీటాక్సిఫికేషన్ గుణాలు ఎక్కువ. అందువల్ల శరీరంలోని వ్యర్థాలను సులభంగా బయటికి పంపగలదు. ముఖ్యంగా చర్మకణాల మధ్య ఇరుక్కుపోయిన దుమ్ము, కాలుష్యం, బ్యాక్టీరియా.. వంటి వాటిని లోపలి నుంచి శుభ్రం చేసి చర్మం మెరిసేలా చేస్తుంది. వివిధ బ్రాండ్లు దీన్ని ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ విక్రయిస్తున్నాయి.
Read More :
“Health Tips | ఉప్పుతో పెను ముప్పు..పరిమిత వాడకమే మేలు!”
“ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే..!”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Health
- Health benefits
- salt
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | శీతాకాలంలో అధికమయ్యే వాయు కాలుష్యం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..
Electric Rice coocker | ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదా.. నిపుణులు ఏమంటున్నారు..?
Brinda Karat | కార్పొరేట్ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగానికి నష్టం : బృందా కారత్
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
AP News | నిత్యావసరాల ధరలు పెంచి విజన్ కబుర్లు ఎందుకు.. కూటమి సర్కారుపై వైసీపీ ఫైర్..!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

