ఉప్పు అప్పుగా తీసుకుంటే కలహాలు వస్తాయని అంటారు నిజమేనా!
Salt | ఉప్పు అప్పుగా ఇస్తే అరిష్టమని, చేతికి తీసుకుంటే కలహాలు కలుగుతాయని అంటారు నిజమేనా?
– ప్రమోదిని, ఉప్పల్
శ్లో॥ ధాన్యమన్న సమృద్ధ్యర్థం మధురాహారదం గుడమ్
రౌప్యం రేతోభివృద్ధ్యర్థం షడ్రసార్థం తు లావణమ్
(శివ మహాపురాణం)

ధాన్యాన్ని దానంగా ఇస్తే అన్న సమృద్ధి కలుగుతుంది. బెల్లాన్ని దానంగా ఇవ్వడం వల్ల మధురమైన ఆహారం లభిస్తుంది. వెండి దానం వల్ల వీర్యాభివృద్ధి, లవణం (ఉప్పు) దానం చేస్తే షడ్రసోపేతమైన ఆహారం లభిస్తుందని పురాణ వచనం. ఆహార పదార్థాలకు రుచిని ఇచ్చే ఉప్పు దానంతో మృత్యుదేవత సంప్రీతి చెంది, ఆయుర్దాయాన్ని, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఉప్పు దానం చేయవచ్చు గానీ, అప్పుగా ఇవ్వకూడదని చెబుతారు. లక్ష్మీదేవి జన్మించిన సముద్రం నుంచే రాతి ఉప్పు పుట్టింది. మిలమిల మెరిసే రాతి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పును అప్పుగా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవిని వేరేవాళ్ల చేతిలో పెట్టినట్టు అవుతుంది. అందుకే ఉప్పును అప్పుగా ఇవ్వడం అరిష్టమని పెద్దలు చెబుతారు. రాత్రి పూట అయితే, కనీసం కుటుంబసభ్యుల చేతికి కూడా ఉప్పు ఇవ్వకుండా జాగ్రత్తపడతారు. ఒకసారి చేజారిన సంపద మళ్లీ రావడమన్నది కష్టసాధ్యం. అందుకే, ఉప్పు చేతికి తీసుకున్న తర్వాత, ఇచ్చిన వాళ్లతో కలహాలు ఏర్పడవచ్చన్న భావన ఏర్పడింది. లక్ష్మీ స్వరూపంగా భావించే ఉప్పును అప్పుగా ఇవ్వకూడదనే నియమం లోకాచారంగా స్థిరపడింది.
– డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుడితే దోషమా?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- devotional
- Doubts
- Pintop1
- salt
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

