పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ప్రత్యేక పూజలు, వ్రతాలు చేసేటపుడు, వివాహ సమయంలో కంకణం ఎందుకు ధరిస్తారు?
– లిఖిత, రామన్నపేట

శుభకార్యం సమయంలో కంకణాన్ని మణికట్టుకు ధరించాలని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఒక సంకల్పానికి, ధర్మానికి కట్టుబడి ఉండటం కోసం కంకణ ధారణ ఆచారం ఏర్పడింది.
వివాహ వ్రత యజ్ఞేషు శ్రాద్ధే హోమేర్చనే జపే
ఆరబ్ధే సూతకం నస్యాద నారబ్ధేతు సూతకం॥
వివాహం, యజ్ఞం, వ్రతాదులు ‘సంకల్ప కంకణ ధారణ’తోనే మొదలవుతాయి. కంకణ ధారణ చేసిన తర్వాత ఆ శుభకార్యం పూర్తయ్యే వరకు సూతకం వంటి ఏ దోషాలూ కంకణం కట్టుకున్నవారికి వర్తించవు. అందుకే వివాహం, యజ్ఞాలు, ఇతర శుభకార్యాలు చేసినప్పుడు కంకణాన్ని ధరించడమనే నియమం ఏర్పడింది. సర్వేశ్వరుడైన సుదర్శనుడు ఆ శుభకార్యానికి రక్షగా ఉంటాడని విశ్వాసం. సంకల్పించిన శుభకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి కంకణ ధారణ సహకరిస్తుంది. కంకణ దారం మూడు పోగులతో గానీ, ఐదు పోగులతో గానీ (బేసి సంఖ్య) ఉండాలి. దానిని మామిడి ఆకుతో గానీ, తమలపాకుతో గానీ, పసుపు కొమ్ముతో గానీ అలంకరించి పూజిస్తారు. ఈ కంకణాన్ని కట్టుకునేటప్పుడు ప్రశాంత మనసు, దృఢ సంకల్పం, నిర్మల భక్తి కలిగి ఉండాలి. కంకణాన్ని పురుషులు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ధరించాలి.
– డా॥ శాస్త్రుల రఘుపతి
73867 58370
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
ఎవరైనా మరణిస్తే పది రోజులు ఎందుకు మైల పాటించాలి.. ఇది ఆచారమా? మూఢ నమ్మకమా?
మానవునికి మరణాన్ని మించిన భయమేముంది?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

