జుట్టు లేకుండా కొట్టకూడదా?
జుట్టులేని కొబ్బరికాయ కొట్టకూడదని చెబుతారు ఎందుకు? దీని వెనుక ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా! పిలకలేని కొబ్బరికాయ కొడితే దోషమా తెలియజేయండి?
- విశ్వనాథ్, నిజామాబాద్

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం॥
అనేవి తొమ్మిది విధాలైన భక్తి మార్గాలు. దీంట్లో చివరిది ఆత్మ నివేదనం. అంటే భగవంతునికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం. పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మ స్వరూపంగా భావించి, దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక. కాయ పైనుండే పొర.. చర్మం. పీచు మాంసం. దృఢంగా ఉండే చిప్ప ఎముకలు. అందులో ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు. కాయలోని నీళ్లు ప్రాణాధారం. పైన ఉండే మూడు కన్నులే ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక. అందుకే మన శరీరాన్ని ఆత్మతో నివేదించుకుంటున్న భక్తి భావంతో కొబ్బరికాయను కొట్టి భగవంతునికి సమర్పించు కోవాలి. ఇందులోని పరమార్థమిదే. అందుకే పిలక లేని కొబ్బరికాయను దేవునికి కొట్టడం దోషమే అవుతుంది. త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి, అతని కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా మూడు కండ్లు, జుట్టుతో తన శిరస్సులా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడని పురాణగాథ.
డా॥ శాస్ర్తుల , రఘుపతి
73867 58370
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- coconut
- dharma sandeham
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

