ఎవరైనా మరణిస్తే పది రోజులు ఎందుకు మైల పాటించాలి.. ఇది ఆచారమా? మూఢ నమ్మకమా?
ఎవరైనా మరణిస్తే, మృతుని దాయాదులు పది రోజులు మైల పాటించాలని చెబుతారు! ఎందుకు?
– కవిత, తూప్రాన్

‘జాయతే సమానే వంశే’ ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు, జ్ఞాతులు. వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా పది రోజులు అశౌచం (మైల) పాటించడం సంప్రదాయంగా వస్తున్నది. వంశంలో ఎవరైనా పుట్టినప్పుడు జాతాశౌచం (పురుడు), మరణిస్తే మృతాశౌచం (సూతకం) పాటించాలి. అవి పుట్టుకతో సంక్రమించిన అనుబంధంతో ఏర్పడేవి కాబట్టి ఆ వంశీయులు సూతకాన్ని విధిగా పాటించాల్సి ఉంటుంది.
మరణించిన వ్యక్తికి సంతాపం తెలియజేసే ఉద్దేశంతో పదిరోజులు అశౌచం పాటించడం ధర్మంగా చెబుతారు. దీనిని ఆచరించడం వెనుక ఒక శాస్త్రీయ దృక్పథమూ ఉంది. పూర్వం ఒక వంశానికి చెందిన వారంతా ఒక ఇంట్లో గానీ, ఒక గ్రామంలో గానీ నివసించే వారు. తమ వంశీయుడు ఎవరైనా మరణించినప్పుడు అందరూ పార్థివదేహాన్ని చూసేందుకు వచ్చేవారు. మృతుని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే, మృతదేహాన్ని చుట్టుకొని కీడు చేసే సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి. ఈ క్రమంలో వాటి ప్రభావం అక్కడికి వచ్చిన మనుషులపై పడుతుంది. మైల పాటించకపోతే వాళ్ల నుంచి ఇతరులకు సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ అనర్థాన్ని అరికట్టడం కోసమే దాయాదులందరూ పదిరోజులు దూరంగా ఉండాలన్న నిర్బంధాన్ని మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం పాటిస్తున్న క్వారంటైన్ లాంటిదే ఇదీ! మృతుని కుటుంబానికి సానుభూతి తెలపడం కోసం, సామాజిక ఆరోగ్య సంరక్షణ కోసం మన పూర్వికులు ఏర్పాటు చేసిన ఆచారం ఇది.
డా॥ శాస్త్రుల రఘుపతి
73867 58370
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
jagadguru adi shankaracharya | ఆదిశంకరుడికి జీవంపోసిన అరుణ్ యోగిరాజ్
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
తులసీదాసు భరోసా హనుమాన్ చాలీసా
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Dead
- devotional
- Pintop1
- quarantine
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

